సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 20 జనవరి 2025 (13:20 IST)

మోదీ ఎప్పటికీ సింహమేనన్న లేడీ యూట్యూబర్: ఉరి తీసిన పాక్ సైన్యం?!!

Sana Amzad
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
మోదీ ఎప్పటికీ సింహమే అంటూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశసించిన పాకిస్తాన్ యూ ట్యూబర్ సనా అంజాద్ గత 15 రోజులుగా కనిపించడంలేదు. ఈమెతో పాటు  భారతదేశాన్ని ప్రశంసిస్తూ యూట్యూబ్‌లో తరచుగా వీడియోలను అప్‌లోడ్ చేసే పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ షోయబ్ చౌదరి కూడా కనిపించకుండా పోయారు. వారిద్దరి జాడ తెలియడం లేదు.
 
లాహోర్‌లో పాకిస్తానీ యూట్యూబర్‌లపై కఠిన చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, 'మోదీ సదా షేర్ హై' అంటూ మన దేశ ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ ఉన్న వీడియోను సనా యూట్యూబ్ ఛానల్ నుండి తొలగించారు. ఈ వీడియోలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ కాశ్మీర్ పర్యటన గురించి ప్రస్తావించింది. ఈమెను పాకిస్తాన్ సైన్యం ఉరి తీసిందని అనేక ట్విట్టర్ హ్యాండిల్స్ నుండి పోస్టులు వస్తున్నాయి.
 
మరోవైపు పాకిస్తాన్ జర్నలిస్ట్, భారతదేశాన్ని తరచుగా ప్రశంసించే అర్జూ కజ్మీ ట్విట్టర్లో పోస్టు చేస్తూ... సనా, షోయబ్‌లను ఉరితీశారనే వాదనలను కొట్టిపడేశారు. యూట్యూబర్లపై పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది నిజమేననీ, జనవరి 1న తనకు పాకిస్తాన్ దర్యాప్తు సంస్థ FIA నుండి కాల్ వచ్చిందని, లాహోర్‌లోని FIA కార్యాలయానికి చేరుకోవాలని కోరారని ఆయన చెప్పారు. నేను ఇస్లామాబాద్‌లో నివసిస్తున్నానని అర్జు చెప్పాడు, కాబట్టి నేను అక్కడికి వెళ్లలేదు. ఐతే షోయబ్ చౌదరి, సనా ఉరిశిక్షకు గురైన వార్త నిజం కాదంటూ అర్జూ X లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.