1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (20:30 IST)

షరతులు లేకుండా చర్చలకు రెడీ అంటోన్న పాక్.. సింధు జలాస్త్రమే కారణమా?

యురి ఘటన నేపథ్యంలో షరతులతో కూడిన చర్చలంటూ పాత పాట పాడే పాకిస్థాన్.. ఓ మెట్టు దిగింది. పాకిస్థాన్ తాజాగా షరతులు లేని చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కాశ్మీర్‌తో పాటు అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమన

యురి ఘటన నేపథ్యంలో షరతులతో కూడిన చర్చలంటూ పాత పాట పాడే పాకిస్థాన్.. ఓ మెట్టు దిగింది. పాకిస్థాన్ తాజాగా షరతులు లేని చర్చలకు సిద్ధమని ప్రకటించింది. కాశ్మీర్‌తో పాటు అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని ఆహ్వానించింది. ఈ మేరకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ.. ఎలాంటి షరతులు లేకుండానే చర్చలకు రెడీ అంటూనే.. కాశ్మీర్ విషయంలో స్పష్టత లేకుండా చర్చలు పూర్తికావని పేర్కొన్నారు. 
 
అంతర్జాతీయ సమాజం కూడా కాశ్మీర్‌ను వివాదాస్పద భూభాగంగా గుర్తించిందని.. ప్రస్తుతం ఒత్తిడి అంతా భారత్‌పైనే ఉందని తెలిపారు. అయితే పాకిస్థాన్ చేసిన ప్రకటనపై రాజకీయ విశ్లేషకులు నోరెళ్లబెడుతున్నారు. గతంలోనూ పాక్ ఇటువంటి ప్రకటనలే చేసిందని, తీరా చర్చలకు వచ్చేసరికి కాశ్మీర్ గురించి పట్టుబట్టడం తెలిసిందేనని అంటున్నారు.
 
ఇదిలా ఉంటే.. యుద్ధం చేయకుండానే భారత్ పాకిస్థాన్‌కు చుక్కలు చూపించాలనుకుంటుంది. ఏ అణ్వస్త్రాలనూ ప్రయోగించకుండానే కేవలం జలాస్త్రం ప్రయోగించడం ద్వారా పాకిస్థాన్‌ను ఎడారిలా మార్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 56 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న సింధు జలాల ఒప్పందాన్ని మోడీ సర్కారు రద్దు చేసుకోనుంది. ఈ ఒప్పందం ద్వారా పాక్ ఉపయోగించుకుంటున్న 80 శాతం నీరు.. ఆ దేశం వాడుకునే వీలుండని తెలుస్తోంది.