శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పాకిస్తాన్ సివిల్ సర్వీస్ పరీక్షలు.. కలెక్టరుగా హిందూ మహిళ

మన శత్రుదేశమైన పాకిస్థాన్‌లో నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఓ హిందూ మహిళ విజయం సాధించింది. దీంతో ఆమె కలెక్టరుగా నియమితులుకానున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 18,553 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. 221 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో 79 మంది మహిళలు ఉన్నారు.
 
ప్రతిష్ఠాత్మక ‘సెంట్రల్‌ సుపీరియర్‌ సర్వీసెస్‌’ (సీఎస్‌ఎస్‌) పరీక్షలో విజయం సాధించిన సనా రామ్‌చంద్‌… పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (పీఏఎస్‌)కు ఎంపికయ్యారు. 
 
పాక్‌లో హిందువులు ఎక్కువగా ఉండే సింధ్‌ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన సనా ఎంబీబీఎస్‌ పూర్తిచేసి డాక్టర్‌గా పనిచేస్తున్నారు. సివిల్‌ సర్వీసెస్‌పై ఆసక్తితో సీఎస్‌ఎస్‌ పరీక్ష రాశారు.