ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (19:53 IST)

ఏపీలో వార్డు వాలంటీర్ల సెల్ ఫోన్లు స్వాధీనం చేస్కోండి: నిమ్మగడ్డ ఆదేశం

ఏపీలో వార్డు వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఫోటో స్లిప్పులను పంచకుండా చూడాలనీ, అలాగే ఎన్నికల విధుల్లో వారు ఏమాత్రం పాల్గొనరాదని సూచించారు.
 
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వుంది కనుక వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఒకవేళ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై ఎన్నికల కోడ్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.