మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 డిశెంబరు 2020 (11:07 IST)

నెల్లూరు బస్సులో ప్రయాణికుడి వద్ద 1 కిలో బంగారం, ఆరున్నర కిలోల వెండి

నెల్లూరులో తమిళనాడు నుంచి వస్తున్న బస్సును తనిఖీ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. కారణం ఏంటంటే.. ఓ ప్రయాణికుడి బ్యాగులో కిలో బంగారం, ఆరున్నర కిలోల వెండితో పాటు 6 లక్షల రూపాయల లభించడమే.
 
వివరాల్లోకి వెళితే... చెన్నై నుంచి నెల్లూరికి వస్తున్న బస్సును నగంలోని ఓ కళ్యాణ మండపం సమీపంలో పోలీసులు తనిఖీ నిమిత్తం ఆపారు. అనంతరం బస్సులో సోదా చేయగా కైలాష్ కుమార్ అనే వ్యక్తి వద్ద భారీగా బంగారం, వెండి, నగదు పట్టుబడింది. అతడి వద్ద సరైన బిల్లులు లేకపోవడంతో బంగారాన్ని, వెండి, నగదును సీజ్ చేశారు పోలీసులు.
 
కాగా గత కొన్ని రోజులుగా తమిళనాడు నుంచి ఏపీకి వస్తున్న వాహనాల్లో బంగారం పట్టుబడుతోంది. ఈ నేపధ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు.