శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 15 మే 2017 (13:58 IST)

గాలిలో ఎగురుతున్న హెలికాప్టర్ పైలట్‌కు ఆకలేసింది.. ఏం చేశాడంటే..? (Video)

గాలిలో ఎగురుతున్న హెలికాఫ్టర్ పైలట్‌కు ఆకలేసింది. ఇక హెలికాప్టర్‌లో ఉన్న స్నాక్స్ తిందామనుకున్నా కుదరలేదు. చివరికి మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ కనిపించడంతో.. హెలికాఫ్టర్‌ను కిందికి దించేశాడు. మెక్ డొనాల

గాలిలో ఎగురుతున్న హెలికాఫ్టర్ పైలట్‌కు ఆకలేసింది. ఇక హెలికాప్టర్‌లో ఉన్న స్నాక్స్ తిందామనుకున్నా కుదరలేదు. చివరికి మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ కనిపించడంతో.. హెలికాఫ్టర్‌ను కిందికి దించేశాడు. మెక్ డొనాల్డ్స్ అవుట్ లెట్ బయట మైదాన ప్రదేశంలో పార్క్ చేసి, దర్జాగా నడచుకుంటూ షాపులోకి వెళ్లి తనకు కావాల్సినవి తీసుకున్నాడు. ఆ పార్సిల్ చేతబట్టుకుని నేరుగా హెలికాఫ్టర్‌ ఎక్కి గాల్లోకి ఎగిరిపోయాడు.
 
దీనికి ఘటనకు సంబంధించిన వీడియోను స్థానికుడు ఓ ఛానల్‌కు పంపడంతో ఇది కలకలం రేపింది. ల్యాండ్ ఓనర్ అనుమతి ఇస్తే హెలికాఫ్టర్‌ను ల్యాండ్ చేయడం సాంకేతికంగా ఎలాంటి నేరం కాదని ఆస్ట్రేలియా సివిల్ ఏవియేషన్ సేఫ్టీ అథారిటీ అధికార ప్రతినిధి తెలిపారు. ఆ పైల‌ట్ ఎవ‌రు అన్న‌ది తెలియ‌క‌పోయినా.. అత‌నే ఓ రేడియోలో మాట్లాడుతూ.. త‌న‌కు ల్యాండింగ్‌కు అనుమ‌తి ఉంద‌ని చెప్పారు.