శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాాబాద్ , ఆదివారం, 5 మార్చి 2017 (04:02 IST)

భారతీయులు ఆందోళన చెందొద్దంటాడు.. రోజుకో నిషేధ బాంబు వస్తానంటాడు. ట్ర్రంపా.. కంపా?

ప్రతిభావంతులైన భారతీయులు అమెరికాలో ఉపాధి అవకాశాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని ఒకవైపు చెబుతూనే భారతీయులు అమెరికాలో పనిచేయలేని చర్యలను రోజువారీగా చేపడుతున్న అమెరికా అధ్యక్షుడు భారత సంతతి అమెరికన్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ నేపథ్యంలోనే హెచ్‌1బీ వీసా

ప్రతిభావంతులైన భారతీయులు అమెరికాలో ఉపాధి అవకాశాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని ఒకవైపు చెబుతూనే భారతీయులు అమెరికాలో పనిచేయలేని చర్యలను రోజువారీగా చేపడుతున్న అమెరికా అధ్యక్షుడు భారత సంతతి అమెరికన్లకు కొరకరాని కొయ్యగా మారాడు. ఈ నేపథ్యంలోనే హెచ్‌1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం మరో బాంబు పేల్చింది! ఈ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను ఆర్నెళ్లపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూఎస్‌ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) వెల్లడించింది. ఏప్రిల్‌ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. 2018 ఆర్థిక సంవత్సరానికి (అక్టోబర్‌ 1, 2017 నుంచి ప్రారంభం)గాను సాధారణ హెచ్‌1బీ వీసాల దరఖాస్తులను కూడా ఏప్రిల్‌ 3 నుంచి స్వీకరించనున్నట్లు తెలిపింది.

 
ప్రత్యేక ఫీజుతో (1,225 డాలర్లు చెల్లిస్తే) హెచ్‌–1బీ వీసాల ఆమోద ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్‌. తాత్కాలిక రద్దు ప్రీమి యం ప్రాసెసింగ్‌కు మాత్రమే వర్తిస్తుందని, దీని వల్ల సాధారణ హెచ్‌1బీ వీసాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. హెచ్‌1బీ వీసాల ప్రాసెసింగ్‌ సమయం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. పెండింగ్‌లో ఉన్న రెగ్యులర్‌ హెచ్‌1బీ వీసాల దరఖాస్తులను పరిష్కరించేందుకు, మొత్తంగా హెచ్‌1బీ వీసాల ప్రాసెసింగ్‌ సమయాన్ని తగ్గించేందుకు ఈ రద్దు నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రీమియం ప్రాసెసింగ్‌ 15 పనిదినాల్లో పూర్తవుతుండగా.. సాధారణ హెచ్‌1బీ వీసాల ప్రాసెసింగ్‌కు మూడు నుంచి ఆరు నెలలు పడుతోంది.
 
అమెరికాలో ఉద్యోగానికి నిపుణులకిచ్చే ఈ తాత్కాలిక వర్క్‌ వీసా (హెచ్‌1బీ)ను ఎక్కువ గా భారత ఐటీ ఇంజనీర్లు, వారికి ఉద్యోగాలి స్తున్న కంపెనీలు ఎక్కువగా వినియోగించుకుం  టున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పటికే హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న పలు కంపెనీలకు.. పెం డింగ్‌లోని తమ దరఖాస్తులను క్లియర్‌ చేసు కునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే.. భారత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ఎక్కువగా ఉద్యో గాలిచ్చే (ఈ హెచ్‌1బీ వీసాల ద్వారా) సిలికాన్‌ వ్యాలీ కంపెనీలు మాత్రం తాజా నిర్ణ యంతో తమ దరఖాస్తులు ఆమోదం పొందేందుకు మరింత సమయం వేచిచూడక తప్పదు.
 
హెచ్‌1బీ వీసా బిల్లుపై భారతీయులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. వలసల విధానంలో సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ బిల్లు పెట్టామని భారత ప్రభుత్వానికి అమెరికా భరోసా ఇచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌కు ఆ దేశ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ‘‘అమెరికా కంపెనీలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని ద్వారా వృద్ధి సాధించొచ్చని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ మార్పులు తీసుకొస్తోంది. అధ్యక్షుడు ట్రంప్‌ తన ప్రసంగంలో ప్రతిభ ఆధారంగా ముందుకెళ్తామని చెప్పారు. అమెరికాలో భారత నైపుణ్యానికి ఉన్న గౌరవం గురించి అందరికీ తెలుసు’’ అని జైశంకర్‌ మీడియాకు చెప్పారు.
 
భారతీయులే లక్ష్యంగా మరో బిల్లు..
‘అమెరికా ఫస్ట్‌’ నినాదంతో రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్‌ ఆలోచనలకు అనుగుణంగా యూఎస్‌ కాంగ్రెస్‌ ముందుకు మరో బిల్లు వచ్చింది. శనివారం సభలో హెచ్‌1బీ, ఎల్‌1 వీసాల సంస్కరణ బిల్లు–2017ను ప్రవేశపెట్టారు. నలుగురు అమెరికన్‌ చట్ట సభ్యుల బైపార్టిషన్‌ (డెమోక్రటిక్, రిపబ్లికన్‌ పార్టీల నుంచి చెరో ఇద్దరు) గ్రూపు ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే యూఎస్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఎక్కువగా ఉన్న భారతీయులకు ఇబ్బందులు తప్పవు. హెచ్‌1బీ, ఎల్‌1 వీసాల చట్టాల్లోని లొసుగులను వినియోగించుకుని కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని.. వీటిలో సంస్కరణలను ప్రతిపాదిస్తూ కొత్త బిల్లు ప్రవేశపెట్టామని బైపార్టిషన్‌ బృందం వెల్లడించింది. ఇప్పటికే యూఎస్‌ కాంగ్రెస్‌ ముందు ఇదే లక్ష్యంతో రూపొందించిన పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
 
యూఎస్‌ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన ఈ వీసాల సంస్కరణ బిల్లు ఆమోదం పొంది అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేస్తే.. అమెరికాలోని కంపెనీలు విదేశీ ఉద్యోగులకు బదులుగా.. స్థానికులను చేర్చుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరైతేనే.. అదీ తక్కువ సంఖ్యలో విదేశీయులకు (అదీ హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలున్నవారికే) అవకాశం ఇవ్వాలి. హెచ్‌1బీ, ఎల్‌1 వీసాలు పొందిన ఉద్యోగులతో స్థానికుల స్థానాలను భర్తీ చేయటం పూర్తిగా నిషేధం. దీంతోపాటుగా హెచ్‌1బీ, ఎల్‌1 వీసా ఉన్న ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది. అమెరికా ఉద్యోగుల హక్కులను కాపాడటంలో ఈ కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
‘హెచ్‌1బీ వీసాల్లోని లొసుగులను దుర్వినియోగం చేస్తున్నందునే సంస్కరణలను ప్రతిపాదించాం. వలసదారుడి కుమారుడిగా ఈ దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతంలో వలసవాదుల శక్తేంటో నాకు తెలుసు. అందుకే విదేశీ ఉద్యోగులు తక్కువ వేతనాలకు పనిచేయటాన్ని మేం అంగీకరించం. అలాగని అమెరికా ఉద్యోగుల అవకాశాలు కొల్లగొట్టడాన్ని ఒప్పుకోలేం’ అని బిల్లు ప్రవేశపెట్టిన నలుగురు సభ్యుల బృందంలోని ప్రవాస భారతీయుడు ఆర్‌వో ఖన్నా వెల్లడించారు.