సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 17 డిశెంబరు 2016 (16:16 IST)

బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా... ముగ్గురుని లేపేశా.... పిలిప్పీన్ అధ్యక్షుడు

పోకిరి చిత్రంలో మహేశ్ బాబు ఓ డైలాగు చెపుతాడు. రౌడీని కాల్చేశాక, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా అంటాడు. ఇలాంటి మాటనే పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి చెప్పేశాడు. తను మేయర్‌గా పనిచేస్తున్నప్పుడు ముగ్గురుని తుపాకీతో కాల్చి హత్య చేసినట్ల

పోకిరి చిత్రంలో మహేశ్ బాబు ఓ డైలాగు చెపుతాడు. రౌడీని కాల్చేశాక, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నయ్యా అంటాడు. ఇలాంటి మాటనే పిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు డుటెర్టి చెప్పేశాడు. తను మేయర్‌గా పనిచేస్తున్నప్పుడు ముగ్గురుని తుపాకీతో కాల్చి హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. తను మేయర్‌గా ఉన్న సమయంలో నేరాలకు పాల్పడ్డ ముగ్గురిని తన తుపాకీతో కాల్చి చంపేసినట్లు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
తను జరిపిన కాల్పుల్లో వారి శరీరాల్లోకి ఎన్ని బుల్లెట్లు దిగాయో తెలియదు కానీ తుపాకీ నుంచి బుల్లెట్ల వర్షం మాత్రం కురిపించానంటూ సంచలన ప్రకటన చేశారు డుటెర్టి. మరోవైపు ప్రస్తుతం అధ్యక్షుడుగా కొనసాగుతున్న ఆయన డ్రగ్ నేరస్తులను వరసబెట్టి చంపేస్తున్నారు. ఇప్పటివరకూ 6 వేల మందికి పైగా డ్రగ్ నేరగాళ్లు హతమయ్యారు. ఇంకా ఎక్కడైనా మిగిలుంటే వారిని కూడా ఏరివేస్తానని అంటున్నారు.