శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (12:39 IST)

కిమ్ జాంగ్ కంటే డొనాల్డ్ ట్రంప్ డేంజర్.. ఉత్తర కొరియాతో సత్సంబంధాలున్నాయ్: రష్యా

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ కంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రమాదమని రష్యా తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను ఏమాత్రం అంచనా వేయలేమని రష్యా పేర్కొంది. కిమ్ జాంగ్ తన మూడేళ్ల కుమార్తెకు

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ కంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా ప్రమాదమని రష్యా తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను ఏమాత్రం అంచనా వేయలేమని రష్యా పేర్కొంది. కిమ్ జాంగ్ తన మూడేళ్ల కుమార్తెకు తన కార్యాలయంలో ఎలాంటి చోటును కల్పించలేదని రష్యా తెలిపింది.

కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన 35 ఏళ్ల కుమార్తెకు వైట్ హౌస్‌లో కీలకపాత్ర కట్టబెట్టారని రష్యా ఎత్తిచూపింది. తమకు సరిహద్దు దేశమైన ఉత్తరకొరియాతో తాము మంచి సంబంధాలనే కొనసాగిస్తామని... అయితే, తమ బంధం చైనా తరహాలో మాత్రం ఉండబోదని రోవ్ పేర్కొన్నారు. 
 
ఉత్తరకొరియా పట్ల అమెరికా అనుసరిస్తున్న వైఖరి తీవ్రంగా ఉందని రష్యా అభిప్రాయపడింది. సిరియాపై చేసిన దాడులకంటే.. ఉత్తర కొరియాపై అమెరికా తీసుకునే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని రష్యా చెప్పుకొచ్చింది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి లావ్ రోవ్ మాట్లాడుతూ, సిరియాపై దాడి చేసిన విధంగానే ఉత్తరకొరియాతో అమెరికా ప్రవర్తించదనే భావిస్తున్నట్టు తెలిపారు.
 
ఇంకా ఇవాంకా వల్లనే సిరియా వైమానిక స్థావరంపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.  ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ఈ విషయాన్ని తెలుపుతూ, సిరియా గ్యాస్‌ దాడిలో గాయపడిన చిన్నారులపై మందును స్ప్రే చేస్తున్న చిత్రాలను చూసి తన తండ్రి ట్రంప్ చలించిపోయారని చెప్పారు. 
 
మరోవైపున గ్యాస్‌ దాడితో తన గుండె పగిలిపోయిందని ఇవాంకా చెప్పినట్లు ‘టెలిగ్రాఫ్‌ పత్రిక’ పేర్కొంది. దాడి భయకరంగా ఉందని, తన తండ్రి సకాలంలో చర్య తీసుకుంటాడని ఆమె చెప్పింది. చెప్పినట్లే ఆ వెనువెంటనే ట్రంప్ ఆదేశాలతో అమెరికా యుద్ధ నౌక సిరియా వైమానిక స్థావరంపై దాడి చేసి ధ్వంసం చేయడం తెలిసిందే. ఇవాంకా కారణంగా సిరియాపై దాడులు జరిగాయనే విషయాన్ని కూడా రష్యా పుతిన్‌కు చెందిన టీవీ అధికారికంగా గుర్తు చేసింది.