మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 6 జులై 2016 (17:08 IST)

వారి కోసమే పోరాడుతున్న ఆమెను ఎత్తుకెళ్లి చెరిచారు... ఐనా వారిని రక్షించేందుకు...

వలస బాధితుల కోసం, వారికి ఎదురవుతున్న సమస్యలపై పోరాడుతున్న ఓ మహిళను వలస బాధితులే అత్యాచారం చేసిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే... నూతన సంవత్సరం వస్తుందంటే చాలు... జర్మనీకి వలస వచ్చిన వలసదారులు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీనితో వారిపై జర్మనీ

వలస బాధితుల కోసం, వారికి ఎదురవుతున్న సమస్యలపై పోరాడుతున్న ఓ మహిళను వలస బాధితులే అత్యాచారం చేసిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే... నూతన సంవత్సరం వస్తుందంటే చాలు... జర్మనీకి వలస వచ్చిన వలసదారులు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు తేలింది. దీనితో వారిపై జర్మనీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారికి ఆశ్రయం కల్పించరాదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో వారి సమస్యలపై పోరాడేందుకు జర్మనీ యువ రాజకీయ నాయకురాలు సెలిన్ గోరెన్ నడుం బిగించారు.
 
ఎప్పట్లానే కొత్త సంవత్సరం రానే వచ్చింది. ఈ సందర్భంగా వలసదారులు తమ సమస్యలపై పోరాడుతున్న ఆ రాజకీయ నాయకురాలిపైనే కన్నేశారు. ఆమెను గత జనవరి అర్థరాత్రి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అత్యాచారం జరిపిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఐతే ఆ ఫిర్యాదులో తనను రేప్ చేసినవారు జర్మన్ భాషలో మాట్లాడారంటూ ఫిర్యాదు చేసింది. కానీ నిజానికి వారు అరబిక్, పార్శీ భాషలు మాట్లాడినట్లు ఆ తర్వాత అంగీకరించింది. మరి అప్పుడు అలా ఎందుకు చెప్పారంటూ ప్రశ్నిస్తే... జాతి వివక్షపై మరిన్ని సమస్యలు ఎదురవుతాయని అలా చెప్పినట్లు తెలిపింది. కాగా ఇప్పుడు ఈ వలసదారుల విషయంలో జర్మనీ ప్రభుత్వం మరింత కటువుగా వ్యవహరించనుందని సమాచారం.