శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 18 జులై 2017 (12:13 IST)

రైలు చివరి బోగీ డోరుకు చిక్కుకున్న మహిళ.. రైలు లాక్కెళ్లిపోయింది.. (వీడియో)

మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ రైలులో చిక్కుకుంది. రైలులో చిక్కుకున్న ఆమెను రైలు లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటలీ రాజధాని నగరం రోమ్ మెట్రో రైల్వే స్టే

మెట్రో రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ రైలులో చిక్కుకుంది. రైలులో చిక్కుకున్న ఆమెను రైలు లాక్కెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటలీ రాజధాని నగరం రోమ్ మెట్రో రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రైలు స్టేషనుకు వచ్చిన పిమ్మట ప్రయాణీకులు దిగారు. ఆ సమయంలో చివరి భోగీ నుంచి దిగిన ఓ మహిళ హ్యాండ్ బ్యాగ్.. బోగీ డోరుకు చిక్కుకుంది. దీన్ని గమనించిన డ్రైవర్ డోర్ లాక్ చేసి.. ఇంజిన్‌ను స్టార్ట్ చేశాడు. దీంతో తప్పించుకోలేని మహిళ రైలు ఫ్లాట్ ఫామ్ నుంచి అలాగే లాక్కెళ్లబడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.