శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (09:56 IST)

బటన్ నొక్కితే ఫ్రాన్స్ మటాష్.. ఊహలకందని అణుక్షిపణిని తయారు చేస్తున్న రష్యా

ఒక్క బటన్ నొక్కితే చాలు ఫ్రాన్స్ వంటి దేశం మటాష్ అయిపోతుంది. అది జపాన్‌ దేశంలోని హిరోషిమా నగరంపై అమెరికా వేసిన అణుబాంబు కంటే వెయ్యి రెట్లు అధిక శక్తివంతమైన అణుక్షిపణి. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన అణ

ఒక్క బటన్ నొక్కితే చాలు ఫ్రాన్స్ వంటి దేశం మటాష్ అయిపోతుంది. అది జపాన్‌ దేశంలోని హిరోషిమా నగరంపై అమెరికా వేసిన అణుబాంబు కంటే వెయ్యి రెట్లు అధిక శక్తివంతమైన అణుక్షిపణి. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన అణుక్షిపణిని తయారు చేయడానికి సంకల్పించింది. దాదాపు 9600 కిలోమీటర్ల (6000 మైళ్లు) దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోగల 'సతాన్-2' అనే క్షిపణిని రూపొందించేందేందుకు ప్రణాళికను సిద్ధంచేసింది. 
 
ఈ మాట వినడానికే భయంపుట్టిస్తున్న ఈ క్షిపణితో లక్ష్యంగా ఎంచుకున్న 16 ప్రాంతాలపై ఒకే క్షిపణితో దాడిచేయగల సత్తా ఈ క్షిపణి సొంతమని రష్యా పేర్కొంది. ఒక్కసారి బటన్ నొక్కితే చాలు దాదాపు ఫ్రాన్స్ వంటి దేశాన్ని సర్వనాశనం చేసే సామర్ధ్యం దీని సొంతం. రెండు సంవత్సరాలలో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా రష్యా ప్రకటించింది. జపాన్‌పై అమెరికా వేసిన అణుబాంబు కంటే ఇది దాదాపు 1000 రెట్లు ఎక్కువ సామర్ధ్యం కలిగివుంది. దీనికి 'సతాన్ -2' అని పేరు పెట్టారు.