బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జనవరి 2025 (18:08 IST)

మార్షల్ లా చట్ట ఉల్లంఘన : దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టు!

YoonSukyeol
ఇటీవల అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను ఆ దేశ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గత యేడాది డిసెంబరు మూడో తేదీన మార్షల్ లా‌ను ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 
 
గత యేడాది డిసెంబరు 3వ తేదీన మార్షల్ లా ప్రకటించి చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై బుధవారం అధికారులు ఆయనను అరెస్టు చేశారు. కొన్ని వారాలుగా ఆయన తన హిల్‌సైడ్ రెసిడెన్స్ ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకుని ఉంటున్న విషయం తెల్సిందే. బుధవారం అక్కడు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత భారీ భద్రత మధ్య తీసుకెళ్లారు. 
 
ఈ తెల్లవారుజామున యాన్ ఇంటికి దాదాపు 3 వేల మందికిపైగా పోలీసులు, అవినీతి నిరోధక విచారణాధికారులు చేరుకున్నారు. ఈ క్రమంలో యాన్‌ను అదుపులోకి తీసుకోకుండా ఆయన మద్దతుదారులు నిలువరించే ప్రయత్నం చేశారు. యాన్‌ను అక్రమంగా అదుపులోకి తీసుకోవడంతోపాటు బహిరంగంగా అవమానిస్తున్నారంటూ అధికారులతో ఆయన లాయర్లు వాగ్వివాదానికి దిగారు. 
 
కాగా, అధికారంలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన దక్షిణ కొరియాలో అధ్యక్షుడు యాన్ అకస్మాత్తుగా ప్రకటించిన మార్షల్ లా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలో రాజకీయ గందరగోళానికి గురిచేసింది. దీంతో డిసెంబర్ 14న చట్ట సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసి పదవి నుంచి అభిశంసించారు.