1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 మే 2016 (17:06 IST)

హత్య కేసులో ఇటలీ నావికుడికి ఊరట.. స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి

హత్య కేసులో ఇటలీ నావికుడి ఊరట లభించింది. అతను స్వదేశానికి వెళ్లేందుకు భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గురువారం తీర్పును వెలువరించింది. గత 2012లో కేరళ తీరంలో ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీ ఆయిల్ ట్యాంకర్ ఎంటీ ఎన్రికా లెక్సీ అనే నౌకకు చెందిన చీఫ్ మాస్టర్ సార్జంట్ మస్సిమిలియానో లటోర్, సార్జంట్ మేజర్ గిరోన్‌లు కాల్చి చంపారు. ఈ కేసులో వీరిద్దరిని అరెస్టు చేశారు. వీరిలో గిరోన్ ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇటలీ దౌత్యకార్యాలయంలో ఉంటున్నారు. 
 
భారత ప్రభుత్వ సహకారంతో ఇటలీ ప్రభుత్వం చేసిన దరఖాస్తును జస్టిస్ ప్రఫుల్ సీ. పంత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీంకోర్టు వేసవి సెలవు కాలపు ధర్మాసనం పరిశీలించింది. గిరోన్ తిరిగి స్వదేశానికి వెళ్ళేందుకు అభ్యంతరం లేదనీ భారత ప్రభుత్వం చెప్పడంతో అతనిని స్వదేశానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. 
 
మరోవైపు.. ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు అవసరమైతే ఆ తీర్పు వెలువడిన నెలలోగా గిరోన్‌ను భారతదేశానికి రప్పిస్తామని న్యూఢిల్లీలోని ఇటలీ రాయబారి హామీ ఇవ్వాలని ఆదేశించింది.