గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (12:09 IST)

మహిళల బ్యూటీ సెలూన్ల లైసెన్స్‌ రద్దు చేయాలి.. తాలిబన్

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అనేక ఆంక్షలు విధించింది. బాలికలు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లకుండా నిషేధం విధించారు. ఆ తర్వాత ఎన్జీవోల్లో పనిచేయకుండా నిషేధం విధించారు.
 
పార్కులు, సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో పని చేయడం నిషేధించబడింది. దానికి అనుగుణంగానే కాబూల్‌తో పాటు దేశంలోని ఇతర ప్రావిన్స్‌లలో బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించినట్లు సమాచారం.
 
మహిళల బ్యూటీ సెలూన్ల లైసెన్స్‌ను రద్దు చేయాలని తాలిబాన్ ప్రభుత్వం చేసిన కొత్త ఉత్తర్వును అమలు చేయాలని కాబూల్ మున్సిపాలిటీకి సంబంధించిన సద్గుణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.