మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 24 ఆగస్టు 2021 (11:11 IST)

శవాలతో సెక్స్ చేస్తున్న తాలిబన్లు: పారిపోయి వచ్చిన మహిళ షాకింగ్ న్యూస్

ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి పారిపోయి వచ్చిన ఓ మహిళ షాకింగ్ న్యూస్ చెప్పింది. తాలిబన్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారనీ, మహిళ కనబడితే చాలు ఆమెను లైంగికంగా అనుభవిస్తారని వెల్లడించింది. తాము అనుభవించే మహిళ బ్రతికి వుందా చనిపోయిందా అని కూడా చూడరని చెప్పుకొచ్చింది. అలా శవాలతో కూడా సెక్స్ చేస్తారని షాకింగ్ న్యూస్ చెప్పింది.
 
తాలిబాన్లు ప్రభుత్వాన్ని కూల్చివేసి, దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోయిన ఒక మహిళ, తాలిబన్ ఫైటర్స్ మహిళల మృత దేహాలపై అత్యాచారం చేస్తున్నట్లు తెలిపింది. 
 
ముస్కాన్ అనే మహిళ ఆఫ్ఘనిస్తాన్‌లో పోలీసు దళంలో పనిచేసింది. తాలిబాన్ ఫైటర్స్ ధాటికి ఆమె అక్కడి నుంచి పారిపోయి భారతదేశంలో అడుగుపెట్టారు.
 
దేశం విడిచి పారిపోవడానికి గల కారణాలను కూడా ఆమె వెల్లడించింది. దానిని మరింత వివరిస్తూ, ముస్కాన్ తన స్వదేశంలో పరిస్థితి గురించి ఒక ఘోరమైన పీడకలగా అభివర్ణించింది. ఈ సందర్భంగా ప్రముఖ మీడియాతో ఆమె మాట్లాడుతూ... "వారు మృతదేహాలను కూడా రేప్ చేస్తారు. తను రేప్ చేసే మహిళ బ్రతికి వుందా, చనిపోయిందా అనే విషయాన్ని వారు పట్టించుకోరు" అని వెల్లడించింది.
 
ఎవరైనా మహిళలు ప్రతిఘటిస్తే తాలిబాన్లు మహిళలను ఎత్తుకెళ్లి వారిపై తమ కోర్కెను తీర్చుకుంటారనీ, మాట వినకపోతే కాల్చి చంపుతారని ఆమె వెల్లడించింది. జిహాదీ గ్రూపు తనను బెదిరించిందని, దాని ఫలితంగా తన ఉద్యోగాన్ని వదిలి ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోవలసి వచ్చిందని ముస్కాన్ వెల్లడించింది.