బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 జులై 2017 (19:14 IST)

మిస్ వరల్డ్ కెనడా ఫైనల్లోకి తెలంగాణ అమ్మాయి.. ఓటింగ్‌లో గెలిస్తే?

మిస్ వరల్డ్ కెనడా ఫైనల్లోకి తెలంగాణ అమ్మాయి అడుగుపెట్టింది. మిస్ వరల్డ్ కెనడా 2017 పోటీల్లో ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన కల్యాణపు శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది. వివరాల్లోకి వెళితే.. వైరాకు చ

మిస్ వరల్డ్ కెనడా ఫైనల్లోకి తెలంగాణ అమ్మాయి అడుగుపెట్టింది. మిస్ వరల్డ్ కెనడా 2017 పోటీల్లో ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన కల్యాణపు శ్రావ్య ఫైనల్‌కు అర్హత సాధించింది. వివరాల్లోకి వెళితే.. వైరాకు చెందిన అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ రవికుమార్‌ కూతురైన శ్రావ్య స్థానికంగా ఏడో తరగతి వరకు చదివింది. ఉన్నత విద్యను ఆదిలాబాద్‌లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం కెనడాలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అనూహ్యంగా కెనడాలోని టొరంటోలో జరుగుతున్న ఈ పోటీల్లో ప్రతిభ కనబరచి ఫైనల్‌ పోటీకి ఎంపికైంది. 
 
ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో 'మిస్‌ నార్తర్న్‌ ఆల్బర్టా వరల్డ్‌' 2017 కిరీటాన్ని దక్కించుకుంది. ఫైనల్‌ పోటీలో శ్రావ్య హావభావాలతో పాటు ఆమె నడవడిక, ప్రవర్తన తదితర అంశాలను గమనిస్తారు. దీంతోపాటు శ్రావ్యకు మద్దతుగా నిలుస్తున్న వారి ఓటింగ్‌ శాతాన్ని పరిశీలించి అన్నింట్లో ముందంజలో ఉంటే అప్పుడు ఆమె మిస్‌వరల్డ్‌ కెనాడాగా నిలుస్తుంది. శ్రావ్యకు ఓటు వేసి తన గెలుపులో పాలుపంచుకోవాలని ఆమె తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.