బుధవారం, 26 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మార్చి 2025 (09:55 IST)

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

Telugu youth
Telugu youth
టెక్సాస్‌లోని ఫీనిక్స్‌లో గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన ఒక తెలుగు యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకు చెందిన అభిషేక్ కొల్లి, చివరిసారిగా కనిపించిన ఫీనిక్స్ నుండి శనివారం తప్పిపోయినట్లు సమాచారం. అలాగే ఆదివారం చనిపోయి కనిపించాడని చెబుతున్నారు. 
 
ఆర్థిక సంక్షోభం, ఊహించని పరిస్థితుల కారణంగా అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అభిషేక్ కుటుంబం ఆర్థిక ఒత్తిడితో పోరాడుతోంది. దీంతో అభిషేక్ అంత్యక్రియల సేవల ఖర్చులను, అతనిని భారతదేశానికి తరలించడానికి అయ్యే ఖర్చులను ఓ స్వచ్ఛంధ సంస్థ భరించేందుకు ముందుకు వచ్చింది. 
 
ఈ విషయాన్ని అరవింద్ కొల్లి సోదరుడు తెలిపాడు. తన సోదరుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. ఇది తమ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకొచ్చాడు.