శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 ఆగస్టు 2017 (08:59 IST)

వధువుకు కోపం వచ్చింది... వరుడు తలకు పిస్టల్‌తో గురి పెట్టింది..

వధువు ఒక్కసారిగా వరుడిపై మండిపడింది. సిగ్గుతో తలదించుకోవాల్సిన వధువుకు కోపం వచ్చింది. పెళ్ళి దుస్తుల్లో వేదికపై వధూవరులు ఇద్దరూ మెరిసిపోతున్నారు. అయితే ఇంతలో ఏమైందో ఏమోకానీ కొత్త జంట మధ్య గొడవ మొదలైంద

వధువు ఒక్కసారిగా వరుడిపై మండిపడింది. సిగ్గుతో తలదించుకోవాల్సిన వధువుకు కోపం వచ్చింది. పెళ్ళి దుస్తుల్లో వేదికపై వధూవరులు ఇద్దరూ మెరిసిపోతున్నారు. అయితే ఇంతలో ఏమైందో ఏమోకానీ కొత్త జంట మధ్య గొడవ మొదలైంది. అంతే వధువు పిస్టల్ తీసి పెళ్లికొడుకు తలకు గురిపెట్టింది. అంతే అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వధువు పాతికేళ్ల కేట్‌ ఎలిజిబెత్‌ ప్రిచర్డ్‌ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతోంది. ఇంతలో వధూవరుల మధ్య గొడవ జరిగింది. వెంటనే.. ప్రిచర్డ్‌ పిస్టల్‌ తీసి తీసి పెళ్లికొడుకు తలకు గురి పెట్టి ట్రిగ్గర్‌ నొక్కింది. ఆ పిస్టల్‌ లోడ్‌ చేసి లేకపోవడంతో ఒక రౌండ్‌ లోడ్‌ చేసి.. కాల్చింది. ఇంతలో పోలీసులు వచ్చి పిచర్డ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో బతుకు జీవుడా అంటూ వరుడు ఊపిరి పీల్చుకున్నాడు.