బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 జూన్ 2017 (10:46 IST)

కారులో కవలలు.. ప్రియుడితో మహిళ రొమాన్స్.. ఊపిరాడక పిల్లలు ఏమయ్యారు?

వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టిస్తాయి. తన ప్రియుడితో కలిసి శారీరకసుఖం అనుభవించేందుకు ఓ మహిళ.. తన ఇద్దరు కవల పిల్లలను పొట్టనబెట్టుకుంది. అమెరికాలోని టెక్సాస్ నగరంలో జరిగిన ఈ దారుణ వివరాలను

వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టిస్తాయి. తన ప్రియుడితో కలిసి శారీరకసుఖం అనుభవించేందుకు ఓ మహిళ.. తన ఇద్దరు కవల పిల్లలను పొట్టనబెట్టుకుంది. అమెరికాలోని టెక్సాస్ నగరంలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
అమాండా హకిన్స్ అనే మహిళకు రెండు సంవ‌త్స‌రాల‌ వయసున్న ఇద్దరు కవల ఆడపిల్లలు ఉన్నారు. ఈమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఆమె ప్రియుడితో కలిసి అమాండా పార్క్‌కి కారులో వెళ్లింది. తన వెంట త‌న ఇద్దరు పిల్ల‌లను కూడా తీసుకెళ్లింది. ఆ తర్వాత తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేందుకు తన ఇద్దరు పిల్లలను కారులో వదిలిపెట్టింది. పిమ్మట త‌న ప్రియుడితో క‌లిసి మ‌ద్యం తాగి, ఓ రూమ్‌లోకి వెళ్లి రాసలీలల్లో మునిగిపోయింది.
 
కారులో పిల్ల‌ల‌ను వ‌దిలేసి వెళ్లిన 15 గంటల త‌ర్వాత కారు వ‌ద్ద‌కి వ‌చ్చి చూసిన ఆ 22 ఏళ్ల యువతికి ఆ కారులో త‌న పిల్ల‌లు చ‌నిపోయార‌ని గుర్తించింది. అప్పటికీ కూడా ఆ మహిళకు ఇద్దరు పిల్లలు చనిపోయారన్న బాధలేకుండా మిన్నకుండిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వచ్చిన కేసు న‌మోదు చేసి ఆ త‌ల్లిని అరెస్టు చేశారు.