అంతుచిక్కని వ్యాధితో పక్షుల మరణం... అమెరికాలో భయం భయం
కరోనా నుండి కోలుకుంటోన్న.. అమెరికాలో అంతుచిక్కని వ్యాధితో పక్షులు మరణించడం కలకలాన్ని రేపుతోంది. వైరస్ కారణంగా పక్షులు అంతుచిక్కని వ్యాధిబారినపడి మరణిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వాషింగ్టన్‌లోని జంతుపరిరక్షణ అధికారులు మాట్లాడుతూ... ఒక్క వాషింగ్టన్‌లో మాత్రమే కాకుండా అమెరికాలోని తొమ్మిది రాష్ట్రాల్లో పక్షుల మరణాల కేసులు నమోదైనట్టు ప్రకటించారు.
వ్యాధికి కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియలేదని, పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. వైరస్ బారినపడ్డ పక్షి కనుగుడ్లు ఉబ్బి, పట్టుకొల్పోయి మరణిస్తున్నాయని, ఇలాంటి కేసు మొదట ఏప్రిల్ నెలలో గుర్తించినట్టు తెలిపారు.
జూన్ నెల నుంచి ఇలాంటి పక్షుల మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుందని, ఇప్పటికే ఇలాంటి అంతుచిక్కని వ్యాధితో చాలా పక్షులు మరణించాయని, గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.