గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (10:29 IST)

దేశంలో కొత్తగా 738 కరోనా మరణాలు

దేశ వ్యాప్తంగా  కరోనా రోజువారీ కేసుల సంఖ్య, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు, 738 మరణాలు సంభవించాయి.

దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  3,05,02,362, కోలుకున్న వారి సంఖ్య 2,96,05,779గా ఉంది. అలాగే ప్రస్తుతం 4,95,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా మొత్తం  4,01,050మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో మొత్తం 34,46,11,291 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.