శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (09:57 IST)

పెరుగుతున్న డోనాల్డ్ ట్రంప్ బాధితులు.. లిప్టులో వెళ్తుంటే ఇష్టం లేకున్నా ముద్దు పెట్టాడట...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ట్రంప్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా ఐ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ట్రంప్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా ఐదుగురు మహిళలు ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన వ్యాఖ్యల ద్వారా తలెత్తిన వివాదాలతో సతమతమవుతున్న 70 ఏళ్ల ట్రంప్‌కు అధ్యక్ష ఎన్నికలకు  నెలరోజుల వ్యవధి కూడా లేని సమయంలో.. తాజా ఆరోపణలు వచ్చి మీద పడడంతో మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. 
 
2005లో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసి అడ్డంగా దొరికిపోయిన ట్రంప్... తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. 74 ఏళ్ల జెస్సికా లీడ్స్ అనే మహిళా వ్యాపారి 30 ఏళ్ల క్రితం ఓ పేపర్ కంపెనీలో పనిచేస్తుండగా ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ''30 ఏళ్ల క్రితం ఓ విమానంలో నేను ట్రంప్ పక్క పక్కనే కూర్చున్నాం. విమానం కదిలిన 45 నిమిషాల తర్వాత అతడు నన్ను తాకరాని చోట్ల తాకడాని అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. 
 
వక్షోజాలపై చేతులు వేయడం, స్కర్ట్ పైన చేతులు వేయడం వంటి వెకిలి చేష్టలు చేశాడు. అతడో అక్టోపస్ (ఎనిమిది కాళ్ల జంతువు). అతని చేతులు అన్నిచోట్లా ఉన్నాయి అంటూ తాను 38 ఏళ్ల వయసులో ఉండగా ఈ సంఘటన జరిగినట్లు లీడ్స్ చెప్పారు. ఆ సంఘటన తర్వాత తాను సీటు మార్చుకున్నాని ఆమె చెప్పారు. మరోపక్క 2005లో ట్రంప్‌‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసిన రేచల్ క్రూక్స్‌ను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించారు. లిప్టులో వెళ్తుండగా తన ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నాడని చెప్పారు. 
 
''అతడు దగ్గరకు లాగి నా పెదాలపై ముద్దు పెట్టాడు అని రేచల్ అన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు తన వయసు 22 ఏళ్లు అని ఆమె చెప్పారు. అంతేకాదు... 13 ఏళ్ల క్రితం ఒక వేడుక సందర్భంగా ట్రంప్ తనను అసభ్యంగా తాకారని మెక్‌గిల్లివ్‌రే(36) అనే మహిళ ఆరోపించారు. 2005లో ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు తనను ట్రంప్ ముద్దు పెట్టుకున్నారని జెన్నిఫర్ మర్ఫీ అనే మరో మహిళ సైతం ఆరోపించారు. అయితే మహిళల కథనాలను, న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ట్రంప్ ప్రచార శిబిరం కొట్టిపడేసింది.