శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2016 (13:15 IST)

డొనాల్డ్ ట్రంప్ పేరిట ఐఫోన్.. ధరెంతో తెలుసా? కోటి.. వజ్రాలు పొదిగి బంగారు కేస్‌తో?

అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఐఫోన్‌ను తీర్చిదిద్దారు. ఐఫోన్ ధరెంతో తెలుసా? అక్షరాలా లక్షా 51వేల డాలర్లు.

అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఐఫోన్‌ను తీర్చిదిద్దారు. ఐఫోన్ ధరెంతో తెలుసా? అక్షరాలా లక్షా 51వేల డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ. ఒక కోటి 2 లక్షలు. అత్యంత ఖరీదైన ఈ ఫోన్లను యూఏఈలోని షార్జాలో ఉన్న 'గోల్డ్‌జెనీ' అనే సంస్థ విక్రయిస్తోంది. వీటి ప్రత్యేకత ఏమిటంటే... ఫోన్‌ మామూలు ఐఫోనే. కానీ.. స్వచ్ఛమైన బంగారంతో చేసిన స్మార్ట్‌కేసులో ఉంటుంది. ఆ కేసులో వజ్రాలనూ పొదిగారు. దానిపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఫొటో, పేరు ముద్రించారు.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలిచిన నేపథ్యంలో.. బంగారంతో చేసిన స్మార్ట్‌ఫోన్‌ కావాలని చైనాకు చెందిన ఓ మహిళ గోల్డ్‌జెనీ సంస్థన అడగడంతో.. బంగారు హంగులతో ట్రంప్ పేరిట ఈ ఫోను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ యజమాని వెల్లడించారు. పెరుగుతున్న గిరాకీని బట్టి వినియోగదారులకు దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. దుబాయితో పాటు అమెరికా.. బ్రిటన్‌ వంటి సంపన్న దేశాల నుంచి ఆర్డర్లు వస్తాయని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.