మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 13 అక్టోబరు 2021 (12:52 IST)

శ్రీవారి భ‌క్తుల క‌న్నుల పంట‌... సప్తగిరీశుడి సేవలో సూర్యుడు

శ్రీవారిని బ్ర‌హ్మోత్స‌వాల‌లో చూడటానికి రెండు క‌ళ్లు చాల‌డం లేదు. స్వామివారి సేవ‌ల‌ను చూసి భ‌క్తజ‌నం త‌న్మ‌యం చెందుతున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. బ్రహ్మోత్సవాల ఏడవ రోజు ఉదయం మలయప్పస్వామి స్వామివారు సూర్యప్రభ  వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనం యెక్క గుణం సర్వ ప్రపంచానికి అదిపతి అయున సూర్య భగవానుడే ఏండుకొండల వానికి వాహనం మారి అయన సేవలో తరిస్తున్నారు.

మరి మానవ మాత్రులం మన మెంత అంటే సమస్త ప్రపంచ కేవలం అయన  సేవకులమే అని అర్థం. వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు. తితిదే, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, వాహన సేవలో పాల్గొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణ మండంలో వాహనసేవ ఏకాంతంగా నిర్వహించారు. ఈ వాహ‌న సేవ చూడ‌టానికి భ‌క్తులు ఎక్కువ మందికి అవ‌కాశం లేకుండా పోయింది. క‌రోనా వ‌ల్ల చాలా త‌క్కువ మందికే ఈ అవ‌కాశం ల‌భించింది. కానీ, వివిధ ఛానళ్ళ లైవ్ లో స్వామి వారి సేవ‌ల‌ను భ‌క్తులు వీక్షించే ఏర్పాటును ఎస్.వి.బి.సి చేసింది.