బిల్ క్లింటన్ ప్రెసిడెంట్‌గా ఉన్నపుడు అత్యాచారం చేశాడు..: నలుగురు మహిళల ఆరోపణ
అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్న సమయంలో తమపై అత్యాచారం చేశాడని నలుగురు మహిళలు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. రెండో డిబేట్‌లో హిల్లరీని ఎదుర్కొనేందుకు ముందు ట్రంప్..
అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ ఉన్న సమయంలో తమపై అత్యాచారం చేశాడని నలుగురు మహిళలు తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. రెండో డిబేట్‌లో హిల్లరీని ఎదుర్కొనేందుకు ముందు ట్రంప్.. క్లింటన్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్న మహిళలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తమపై అత్యాచారానికి పాల్పడ్డారని ఈ సందర్భంగా ముగ్గురు మహిళలు ఆరోపించారు.
మరో మహిళ మాత్రం తాను బాలికగా ఉనప్పుడు క్లింటన్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో మహిళలపై తాను చేసిన అశ్లీల వ్యాఖ్యల టేపులు బయటపడడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ట్రంప్.. హిల్లరీని ఎదుర్కొనేందుకు బాధిత మహిళలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం.