సోమవారం, 10 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మార్చి 2025 (17:26 IST)

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

chiru gift to srileela
యువ హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతిని ప్రదానం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కానుక ఇచ్చారు. "విశ్వంభర" సెట్స్‌లో ఉన్న చిరంజీవిని కలిసేందుకు శ్రీలీల వచ్చారు. ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఉమెన్స్ డే విషెస్ చెప్పారు. ఆమెకు చిరంజీవి దుర్గాదేవి అమ్మవారి ప్రతిమను బహుకరించారు.
srileela selfie
 
చిరంజీవి నుంచి అందిన గిఫ్టుతో శ్రీలీల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులైపోయింది. ఈ సందర్భంగా శ్రీలీల చిరంజీవితో ఒక మెగా సెల్ఫీ తీసుకుని సంతోషంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె షేర్ చేశారు. కాగా,శ్రీలీల తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్న విషయం తెల్సిందే.