ల్యాండ్‌మైన్స్ పేలుళ్లను కూడా తట్టుకునే శక్తిమంతమైన కారు!
బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ బాధ్యతలు స్వీకరించారు. రిషి సునక్, ఆయన భార్య అక్షత మూర్తిల ఆస్తుల విలువ బ్రిటన్ రాజు చార్లెస్-3 కంటే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా, రిషి సునక్ గ్యారేజీలో అత్యంత విలాసవంతమైన, ఖరైదీన కార్లు ఉన్నాయి.
వీటిలో కొన్ని కార్లు మందుపాతరల పేలుళ్లను కూడా తట్టుకునే శక్తిమంతమైన వాహనాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఒకటి జాగ్వార్ ఎక్స్ జే ఎల్ మోడల్ కారు. దీనివిలువ రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ఈ కారులో పోర్టబుల్ ఆక్సిజన్ ట్యాంకులు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ జాగ్వార్ ఎక్స్ జే ఎల్ కారులో 3.0 లీటర్ టర్బోచార్జ్‌డ్ వీ6 ఇంజిన్‌ను అమర్చారు. ఇది 225 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 4 సెకన్లలోనే 100 కిలోమీటర్ వేగాన్ని అందుకుంటుంది. దీని ధర గరిష్టంగా రూ.1.97 కోట్లు. ఈ కారు అత్యంత శక్తమంతమైనది. ఇది మందుపాతరల పేలుడును కూడా తట్టుకోగలదు.
ఇది అల్ట్రా లగ్జరీ సెడాన్ సెగ్మెంట్‌కు చెందిన కారు. ఇందులో కేవలం లగ్జరీకి మాత్రమే కాదు అందులో ప్రయాణించే వారి భద్రతకు కూడా పెద్దపీట వేసేలా ఇందులో ఫీచర్లు ఉన్నాయి. కారు కింది భాగంలో 33 ఎంఎం మందంతో లోహపు ప్లేటును ఏర్పాటు చేశారు.
కింది భాగంలో పేలుడు సంభవించినా, ఆ ఉక్కు ప్లేటు పేలుడును అడ్డుకుంటుంది. కారు ఉపరితలంపై కెవార్ల్, టైటానియం కవచం ఉంటుంది. ఇది తుపాకీ గుళ్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే, ఈ కారు రిషి సునక్ తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించకముందు నుంచే ఉపయోగిస్తున్నారు.