1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: బుధవారం, 15 జూన్ 2022 (12:26 IST)

ఇంట్లో వంద బొద్దింకలను పెంచే వారికి బంపరాఫర్

Cockroaches
ఇంట్లో వంద బొద్దింకలను పెంచే వారికి బంపరాఫర్ లభిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షన్నర రూపాయలను అందిస్తుంది. బొద్దింకలను పెంచడానికి ఒక కంపెనీ భారీ డబ్బు అందిస్తోంది. వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాలోని ఒక పెస్ట్ కంట్రోల్ కంపెనీ తన కొత్త ఔషధాన్ని పరిశోధిస్తోంది. 
 
ఈ పరిశోధనకు బొద్దింకలు చాలా అవసరం. పురుగులను నిర్మూలించడంలో ఇది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకోవడానికి కంపెనీ ఆ బొద్దింకలపై మందును పరీక్షిస్తుంది. 
 
ఇందుకోసం కంపెనీ బొద్దింకలను పెంచుకునే ఇళ్లను వెతుకుతోంది. కంపెనీ ఆ ఇళ్లలో కనీసం 100 బొద్దింకలను విడుదల చేస్తుంది. ఆ బొద్దింకలను కదలికలను కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రతిఫలంగా కంపెనీ 2 వేల డాలర్లు అంటే దాదాపు 1 లక్షా 56 వేల రూపాయలను అందజేస్తుంది.