అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ : డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి.
ఇప్పటికే ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి అయిన హిల్లరీ క్లింటన్, మీడియా కలసి రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని, నవంబర్ 8న జరిగే సాధారణ ఎన్నికల్లో సైతం పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ట్రంప్ ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఓటమి భయంతోనే డెమోక్రాట్లు ఇలాంటి నీచమైన చర్యలకు దిగుతున్నారని... ఈ వ్యవహారంపై తన సొంత పార్టీ నేతలు కూడా మౌనంగా ఉండటం మంచిది కాదని అన్నారు.
రిగ్గింగ్ వ్యవహారంలో వైట్‌హౌస్‌కు కూడా ప్రమేయం ఉందని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకుముందు కూడా రిగ్గింగ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో, తన పాత వీడియోలను వెలుగులోకి తెచ్చి, తనకు మహిళల ఓట్లు దక్కకుండా మీడియా కుట్రకు పాల్పడిందని ఆయన విమర్శించారు.