శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (11:17 IST)

పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించలేం : అమెరికా

పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించలేమని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఆ దేశ అధికార ప్రతినిధి జాన్ కిర్‌బి మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను పాకిస్థాన్‌ను ఉగ్ర దేశం

పాకిస్థాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించలేమని అగ్రరాజ్యం అమెరికా స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఆ దేశ అధికార ప్రతినిధి జాన్ కిర్‌బి మాట్లాడుతూ... ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను పాకిస్థాన్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించే ఆలోచన అమెరికాకు లేదని స్పష్టం చేశారు. 
 
పాకిస్థాన్, భారత్‌తో స్నేహాన్ని కొనసాగిస్తామని, భారత్‌కు ముప్పు వాటిల్లే అంశాలపై పోరాడుతామన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను రూపుమాపడానికి, కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాలు అర్థవంతమైన చర్చలు చేపట్టాలని సూచించారు. కాశ్మీర్ విషయంపై అమెరికా వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.