ఆ సమయంలో నువ్వు అరవలేదు.. ఏడవలేదు కదా అది రేప్ ఎలా అవుతుందన్న పెద్దమనిషి
ఇటలీలోని టురిన్ నంగరంలో రేప్‌కు గురైన ఒక బాధితురాలు అక్కడి న్యాయ స్థానంచేత ఘోర అవమానానికి గురైంది. అత్యాచారం జరుగుతుంటే కాపాడండి, కాపాడండి అని అరవని పాపానికి రేప్ చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి హాయిగా బతుక్కోపో అంటూ కోర్టు వదిలేసింది.
బాధితుల వైపు సానుభూతి లేకపోతే న్యాయాధికారులైనా ఇచ్చే తీర్పులు బాధితులకు అన్యాయం చేస్తాయనేందుకు అనేక నిరూపణలు ఉన్నాయి. మన దేశంలో ఇలాంటివి కొల్లలు. రేప్ చేశాడా ఎక్కడ పట్టుకున్నాడు, ఏం లాగాడు, పట్టుకుని ఏం చేశాడు..ఎలా చేశాడు, ఆ సమయంలో నువ్వేం చేసావు అనే ప్రశ్నలతో విసిగించే న్యాయవాదులు కొందరైతే, రేప్ చేశాడనేందుకు బలమైన సాక్ష్యాధారాలు లేవంటూ సంశయ ప్రయోజనం ప్రాతిపదికన కేసులే కొట్టేస్తున్న న్యాయమూర్తులు కొందరు.
ఇదేదో మనదేశంలోనే జరుగుతున్నాయనుకుంటుంటే విదేసాలు కూడా ఈ తరహా తీర్పులకు తక్కువ తినలేదని నిరూపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా ఇటలీలోని టురిన్ నంగరంలో రేప్‌కు గురైన ఒక బాధితురాలు అక్కడి న్యాయ స్థానంచేత ఘోర అవమానానికి గురైంది. అత్యాచారం జరుగుతుంటే కాపాడండి, కాపాడండి అని అరవని పాపానికి రేప్ చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించి హాయిగా బతుక్కోపో అంటూ కోర్టు వదిలేసింది.
విషయానికి వస్తే ఆసుపత్రి పడకమీద ఉన్న బాధితురాలిని ఆమెకు తెలిసిన వ్యక్తే అత్యాచారం చేశాడు. తీరా విషయం బయటపడి కోర్టువరకు వెళ్లింది. ఆ సమయంలో న్యాయమూర్తి అడిగిన ప్రశ్న లాయర్లను బిత్తరపోయేలా చేసింది.తనకు తెలిసిన వ్యక్తే తనను రేప్ చేస్తుంటే బాధతో ఆమె ఎందుకు ఏడవలేదని, కాపాడమని ఎందుకు అడగలేదని జడ్డి డైమాంటే మునిస్సి పదే పదే బాధితురాలిని, ఆమె లాయర్లను ప్రశ్నించాడు.
ఉత్తర ఇటలీలోని టురిన్ నగరంలో రేప్‌నకు గురైన ఓ బాధితురాలు ‘రక్షించండి, రక్షించండి’ అంటూ అరవనందుకు, రేప్ చేస్తుంటే బాధతో ఏడవనందుకు 46 ఏళ్ల నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించి ఇటీవల విడుదల చేసింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఆస్పత్రి పడక మీదున్న బాధితురాలు తనకు తెలిసిన వ్యక్తే తనను రేప్ చేస్తుంటే బాధతో ఎందుకు ఏడవలేదని, రక్షించడంటూ ఎందుకు ఇతరుల సహాయాన్ని అర్థించలేదంటూ జడ్జి డైమాంటే మునిస్సీ పదే పదే బాధితురాలిని, ఆమె న్యాయవాదులను ప్రశ్నించారు.
ఇక మన దేశంలో లాగే నిందితుడు తన అడ్డ గోలు వాదనను కోర్టులో చేశాడు. బాధితురాలితో తాను గతంలో కలిసి పనిచేసినందవల్ల పలకరించేందుకు ఆస్పత్రికి వెళ్లానని, ఆమె అంగీకారంతోనే తాను సెక్స్‌లో పాల్గొన్నానని, అందుకే ఆమె అరుపులు, కేకలు పెట్టలేదంటూ నిందితుడు చేసిన వాదననే జడ్జి నమ్మారు. ఇంకా తనకు అంతకుముందు కూడా బాధితురాలితో తనకు లైంగిక సంబంధాలున్నాయని ఈ సందర్భంగా నిందితుడు కోర్టుకు తెలిపారు.
ఆ న్యాయమూర్తి ఆ వాదననే నమ్మాడు. అతగాడు అత్యాచారం సల్పుతున్న సమయంలో ఆమె చాలా బలహీనంగా ఉన్నారని, తెలిసిన వ్యక్తే అంత ఘాతుకానికి పాల్పడుతుంటే దిగ్భ్రాంతితో నోటమాట రాకుండా ఉండిపోయారని బాధితురాలు లాయర్లు, చివరకు ఆమే స్వయంగా చెప్పినా న్యాయమూర్తి విశ్వసించలేదు. పరస్పర అంగీకారంతో జరిగిన సెక్సు రేప్ కిందకి రాదన్న కారణంతో న్యాయమూర్తి ఆ నిందితుడిని నిర్దోషిగా ప్రకటించి ఇంటికి పంపేశారు.
షరా మామూలుగానే ఇటలీ వ్యాప్తంగా మహిళా సంఘాలు గొడవ చేయడం, పార్లమెంటుకు కూడా ఈ కేసు చర్చకు రావడంతో కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని న్యాయమంత్రి ఆదేశించడం కాసింత ఊరట కలిగించే విషయం.
సంశయ లాభం అన్నివేళలా బాధితులకే అన్యాయం చేస్తూ తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తోందన్నది నిజమే కదా.