సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (14:37 IST)

ఫుట్‌బాల్ మ్యాచ్.. గ్రౌండ్లోకి శునకం.. అందరినీ ఆటాడుకుంది.. (వీడియో)

అర్జెంటీనాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో శునకం హల్ చల్ చేసింది. ఏకంగా ఫుట్ బాల్ గ్రౌండ్లోకి వచ్చేసింది. దీంతో మ్యాచ్ కాసేపు ఆగింది. ఇంతకీ ఏం జరిగిందంటే? అర్జెంటీనాలో సాన్ లొరెంజో, ఆర్సెలాన్ జట్ల మధ్య జ

అర్జెంటీనాలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో శునకం హల్ చల్ చేసింది. ఏకంగా ఫుట్ బాల్ గ్రౌండ్లోకి వచ్చేసింది. దీంతో మ్యాచ్ కాసేపు ఆగింది. ఇంతకీ ఏం జరిగిందంటే? అర్జెంటీనాలో సాన్ లొరెంజో, ఆర్సెలాన్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్‌లో ఓ పెంపుడు కుక్క స్టేడియంలోకి వచ్చేసింది. ఆ చిన్న పెంపుడు కుక్క వ‌చ్చి ఫుట్‌బాల్‌తో ఆడ‌టం మొద‌లుపెట్టింది. 
 
ఆటగాళ్లు ఎంత వారించినా ఆ శునకం అక్కడ నుంచి కదల్లేదు. ఫుట్‌బాల్ కాసేపు గ్రౌండ్లో ఆడుకున్న ఆ శునకాన్ని.. ఎట్టకేలకు మైదానం బయటికి తీసుకెళ్లారు. అక్కడ కూడా మైకును కొరుకుతూ శునకం అల్లరి చేసింది. కుక్క చేసిన అల్లరి వీడియో అర్జెంటీనా టీవీ ఛాన‌ల్ టీవైసీ స్పోర్ట్స్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు లైకులు వెల్లువెత్తుతున్నాయి.  వైరల్ అవుతున్న ఈ వీడియోకు దాదాపు 9000ల రీట్వీట్లు వ‌చ్చాయి.