సంబంధిత వార్తలు
- రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్
- ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి
- అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్
- లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...
- ఊచకోత, బస్సు దహనం, సామూహిక హత్యల నేపధ్యంలో 23 చిత్రం
ఎఫ్1 వీకెండ్ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి
Rana sandadi
ప్రపంచ వ్యాప్తంగా తన విజన్‌కి పేరుపొందిన రానా, ఈ వేడుకలో తన భాగస్వాములు అయిన ఇండియన్ మ్యూజిక్ స్టార్ అనిరుధ్, సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్ శ్రీ హర్ష వడ్లమూడితో కలిసి తమ ప్రీమియమ్ టకీలా బ్రాండ్ అయిన లోకా లోకాను ప్రమోట్ చేస్తున్నారు. ఎఫ్1 మియామి గ్రాండ్ ప్రిక్స్‌కు ప్రపంచం నలుమూలల నుండి సెలబ్రిటీలు, రేసింగ్ స్టార్లు వచ్చి చేరగా, లోకా లోకా పార్టీ హై-ప్రొఫైల్ నెట్‌వర్కింగ్ కి స్టేజ్ గా నిలిచింది.
ఫోటోలు, వీడియోల్లో రానా లైట్ మూడ్‌లో కనిపించగా, క్యూబా గూడింగ్ జూనియర్‌తో నవ్వులు పంచుకున్నారు, అలాగే 50 సెంట్స్‌తో బ్యాక్‌స్టేజ్‌లో కలిసాడు — ఇంతలో 50 సెంట్స్ తన సర్ప్రైజ్ పెర్ఫార్మెన్స్‌తో సందడిని మరింత పెంచాడు. ఇది ఇండియన్ ట్యాలెంట్, అమెరికన్ స్టైలుతో కలసిన ఒక స్టైలిష్ కలయికగా మారింది.
ప్రపంచ లైఫ్స్టైల్ వర్గాల్లో లోకా లోకా మంచి పేరు తెచ్చుకుంటున్న తరుణంలో, రానా భారత్‌లో తన నెక్స్ట్ జెన్ బ్రాండ్ , కంటెంట్ సామ్రాజ్యాన్ని నిర్మిస్తుండగా, ఇలాంటి సందర్భాలు ఆయనను ఒక రియల్ కల్చరర్ బ్రిడ్జిగా నిలుపుతున్నాయి — ఇండియన్ క్రియేటివ్ ఎనర్జీని, వ్యాపారవేత్తల ప్రతిభను గ్లోబల్ నెట్‌వర్కుల్లోకి తీసుకెళ్తున్నారు.
