ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 జూన్ 2017 (14:16 IST)

రసాయన దాడి చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు : ఉ.కొరియాకు అమెరికా వార్నింగ్

ఉత్తర కొరియాకు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ దఫా రసాయనదాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. రసాయనిక దాడులతో ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ సిరియాను రక్తసిక్తం చేస్తున్న విషయ

ఉత్తర కొరియాకు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ దఫా రసాయనదాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. రసాయనిక దాడులతో ఆ దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ సిరియాను రక్తసిక్తం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో అదే తరహా దాడికి ఆయన మరోమారు సిద్ధమవుతున్నారు. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి రసాయనిక దాడికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బషర్‌కు వార్నింగ్ ఇచ్చింది. 
 
బషర్ పాలనలో మరో భారీ కెమికల్ అటాక్ జరగనుందని... ఈ దాడి భారీ సంఖ్యలో ప్రజల ప్రాణాలను బలి తీసుకోనుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ షాన్ స్పైసర్ తెలిపారు. కాగా, ఏప్రిల్‌లో సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో 100 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.