మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2017 (10:57 IST)

యువకుడితో అక్రమ సంబంధం.. 16ఏళ్ల పాటు చీకటి గదిలో నిర్భంధం.. మరుగుదొడ్డి..?

యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబ ప్రతిష్ఠ మంటగలిసేలా గర్భం దాల్చిన యువతిని తండ్రి సోదరులు కలిసి 16 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించిన దారుణ ఘటన బ్రెజిల్‌లో నగరంలో వెలుగు చూసింది.

యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబ ప్రతిష్ఠ మంటగలిసేలా గర్భం దాల్చిన యువతిని తండ్రి సోదరులు కలిసి 16 ఏళ్ల పాటు చీకటి గదిలో బంధించిన దారుణ ఘటన బ్రెజిల్‌లో నగరంలో వెలుగు చూసింది. బ్రెజిల్‌లోని ఉరుబురితమ నగరానికి చెందిన మారియా లుసియా అనే యువతి గర్భం దాల్చి కుటుంబ ప్రతిష్ఠ దెబ్బతీసిందనే కోపంతో సాక్షాత్తూ తండ్రీ, కొడుకు కలిసి ఆమెను 16 ఏళ్ల పాటు మూడు మీటర్ల ఇరుకు గదిలో బంధించారు.
 
ఆ గదిలో కనీసం మరుగుదొడ్డి కూడా లేకపోవడంతో ఆ గది కాస్తా మల, మూత్రాలతో అత్యంత దుర్గంధంగా మారింది. దీంతో ఆ యువతి నగ్నంగానే మల,మూత్రాల దుర్గంధం మధ్య 16 ఏళ్ల పాటు దుర్భర జీవనం సాగించింది. యువతిని బంధించిన గది నగరానికి మారుమూలన ఉండటంతో ఆమె చేసిన ఆర్తనాదాలు ఎవరికి వినిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అందించిన సమాచారం మేర బ్రెజిల్ పోలీసులు ఆమెను నిర్భంధం నుంచి విముక్తి కల్పించారు.