శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 24 ఏప్రియల్ 2017 (02:36 IST)

ఇదిగో.. అలా చూశావంటే అట్టే ముద్దెట్టేసుకుంటా.. బెదిరించిన డ్రింకర్

తాగుబోతుల మాటలకు విలువు ఉండదు. ఎందుకంటే తాగిన మైకంలో వారేం మాట్లాడిందీ మత్తు దిగ్గానే మర్చిపోతారని అందరూ ఆంటుంటారు. కానీ తాగిన మైకంలో వాళ్లు మరింత స్పష్టంగా, మరింత డేరింగ్‌గా, దూకుడుగా ఉంటారని కూడా నిజమే. పుల్లుగా తాగేసి కారు నడుపుతున్న ఒక మహిళ పోలీ

తాగుబోతుల మాటలకు  విలువు ఉండదు. ఎందుకంటే తాగిన మైకంలో వారేం మాట్లాడిందీ మత్తు దిగ్గానే మర్చిపోతారని అందరూ ఆంటుంటారు. కానీ తాగిన మైకంలో వాళ్లు మరింత స్పష్టంగా, మరింత డేరింగ్‌గా, దూకుడుగా ఉంటారని కూడా నిజమే. పుల్లుగా తాగేసి కారు నడుపుతున్న ఒక మహిళ పోలీసు అధికారి ఆపి అరెస్టు చేయబోతే, అట్టా చూశావంటే అట్టే ముద్దెట్టేసుకుంటానని బెదిరించింది. ఆమె ఇంకా ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడుతుందో అని భయపడిపోయిన పోలీసులు బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకుని బేడీలు వేశారు.
 
అమరికాలోని ఫ్లోరిడాలో బాగా తప్పతాగిన ఒక టీచర్, తన స్నేహితురాలిని కలిసేందుకు కారులో బయలుదేరింది. ఆమెతోపాటు 10 ఏళ్ల ఆమె కొడుకు కూడా కారులో ఉన్నాడు. స్రేనాపార్కర్(43) అనే మహిళ రాత్రి గం.08-00లకు స్కూల్లో  విధులు ముంగించుకుని  కారులో ఇంటికి చేరుకుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంది. తర్వాత మందు తాగడం మొదలుపెట్టింది. ఆమె స్నేహితురాలు ఫోన్ చేసిందని ఆమెను కలిసేందుకు కారులో తన కొడుకుతో కలిసి బయలుదేరింది. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆమె కారును ఆపారు. అప్పటికే ఆమె మరో కారును ఢీకొట్టి వస్తోంది.
 
ఆ కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె కారును ఆపారు. స్నేకర్ బాగా తాగి కారు నడుపుతోందని గుర్తించి, కారు దిగమని కోరారు. ఆమె కారు దిగేదిలేదని భీష్మించుకుని కూర్చుంది. బలవంతంగా పోలీసులు ఆమెను కారులో నుంచి బయటకు తీసుకువచ్చారు. 
 
పక్కనున్న పోలీసు అధికారిని ఉద్దేశించి స్నేకర్, తనను అలా తీక్షణంగా చూడొద్దని, అలాగే చూస్తే తాను అతన్ని ముద్దుపెట్టుకుంటానని చెప్పింది. అంతటితో ఆగకుండా  తాగిన మైకంలో ఆమె నానాహంగామా చేసిందని, దాన్ని భరించలేక వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. \