శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 మార్చి 2017 (13:25 IST)

''నోట్స్ టు మై ఫాదర్'' పేరిట తొలి వాస్తవిక డాక్యుమెంటరీ.. తండ్రి పెళ్ళి చేసిస్తే.. భర్త అమ్మేశాడు..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అట్టహాసంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మహిళలపై చోటుచేసుకున్న అఘాయిత్యాల సంఖ్య పెరిగిపోతోంది. ఏమాత్రం తగ్గలేదు. హత్యలు, అ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అట్టహాసంగా జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో మహిళలపై చోటుచేసుకున్న అఘాయిత్యాల సంఖ్య పెరిగిపోతోంది. ఏమాత్రం తగ్గలేదు. హత్యలు, అమానుష చర్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా ఓ స్వచ్ఛంధ సంస్థ ఓ వాస్తవ ఘటనను డాక్యుమెంటరీగా రూపొందించి కళ్ళకు ముందుంచింది.
 
''నోట్స్ టు మై ఫాదర్'' పేరిట హైదరాబాద్ "మై ఛాయిసెస్" అనే ఎన్జీవో సంస్థ రూపొందించిన ఈ లఘు చిత్రానికి ముంబైకి చెందిన ఫిల్మ్ మేకర్ జయేషా పటేల్ దర్శకత్వం వహించారు. దీన్ని టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ప్రీమియర్ షోల్లో ప్రదర్శించనున్నారు. వర్చ్యువల్ టెక్వాలజీ (వీఆర్) మెల్లగా విస్తరిస్తున్న నేపథ్యంలో దాన్నే సాధనంగా చేసుకుని మై ఛాయిసెస్ సంస్థ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. 
 
ఓ పేద మహిళకు ఆమె తండ్రి వివాహం చేయడం.. భర్త ఆమెను వేశ్యా గృహానికి అమ్మేయడం.. అక్కడ ఆమె పడిన కష్టాలను ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వాస్తవ డాక్యుమెంటరీకి షేర్లు, లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.