శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (17:43 IST)

ఆ గొర్రె ఖరీదు అక్షరాలా రూ.3.50 కోట్లు...

ప్రపంచంలోనే అత్యంత ఖరైదీన కారుగా రోల్స్ రాయిస్‌గా పేర్కొంటుంటారు. ఈ కారు ధర కనిష్టంగా రూ.3.5 కోట్ల నుంచి గరిష్టంగా రూ.10.50 కోట్లుగా పలుకుతుంది. అలాగే, గొర్రెల్లో ఈ గొర్రె ధర కూడా కోట్ల రూపాయల్లోనేవుంది. ఆ గొర్రె ఖరీదు ఏకంగా 3.5 కోట్ల రూపాయలు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రెగా గుర్తింపు పొందింది. ఈ గొర్రె పేరు డబుల్ డైమండ్. స్కాట్లాండ్ దేశంలో కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతి గొర్రెగా దీనికిపేరుంది. 
 
స్కాట్లాండ్ దేశంలో ఈ రకం గొర్రెలను స్కాటిష్ లైవ్ స్టాక్‌లో వేలం వేస్తుంటారు. ఈ వేలంలో డబుల్ డైమండ్ అనే గొర్రె ఏకంగా రూ.3.5 కోట్లు పలికింది.  ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా ఇది పేరు తెచ్చుకుంది. అంతకు ముందు ఇదే జాతికి చెందిన ఓ గొర్రె 2,31,000 స్టెర్లింగ్ పౌండ్ల ధర పలికింది.
 
ఆ రికార్డును డబుల్ డైమండ్ బీట్ చేసింది. చార్లీ బోడెన్ అనే వ్యక్తి టెక్సిల్ జాతికి చెందిన మేలురకం గొర్రెలను పెంచుతున్నాడు. అందులో ఒకటి డబుల్ డైమండ్ కూడా ఒకటి. ఈ స్థాయిలో ఈ గొర్రె ధర పలుకుతుందని తాను కలలోకూడా అస్సలు ఊహించలేదని చార్లీ బోడెన్ చెప్పుకొచ్చారు.