జూమ్ వీడియో కాల్‌లో భర్త... ఆయన వెనుక నగ్నంగా భార్య
కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది తమతమ ఇంటి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, తమతమ ఉన్నతస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. అలాగే, పలువురు రాజకీయ నేతలు కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ ఉధృతి, రోజూ నమోదవుతున్న కేసులు ఇతర వివరాలను జూమ్ మీటింగ్‌ను నిర్వహిస్తూ తెలుసుకుంటున్నారు.
ఈక్రమంలో ఓ రాజకీయ నేత తన ప్రతినిధులతో తన ఇంట్లో నుంచే జూమ్ యాప్ ద్వారా ఓ సమావేశం నిర్వహించారు. కొద్దిసేపటికి ఆయన భార్య ఒంటిమీద నూలుపోగు లేకుండా వచ్చి వెనుక నిల్చుంది. ఆవలివైపు సమావేశంలోని ప్రతినిధులు అవాక్కయ్యారు. తన వెనుక భార్య నగ్నంగా నిల్చున్నదనే సంగతి తెలియని ఆ నేత, జోరుగా చర్చలో మునిగిపోయారు.
"అందరూ చూస్తున్నారు. సమావేశంలో ఉన్నారనే విషయాన్ని మీరు ఆమెకు చెప్పలేదా?" అంటూ ఓ ప్రతినిధి చెప్పడంతో ఆ నేత వెనక్కు తిరిగారు. న్యూడ్‌గా భార్య కనిపించే సరికి నోరెళ్ల బెట్టారు! సౌతాఫ్రికాలో ఇటీవల గ్జోలిలే డేవు అనే నేతకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆ నేత సిగ్గుతో రెండు చేతులను ముఖానికి అడ్డుపెట్టుకున్నారు. తర్వాత సమావేశ ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు.