రాజధాని హస్తినలో కలకలం : మూసివున్న ఇంట్లో నాలుగు మృతదేహాలు

murder
ఠాగూర్| Last Updated: గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:44 IST)
రాజధాని ఢిల్లీలోని ఓ ఇంట్లో నాలుగు మృతదేహాలు కనిపించాయి. ఇవి స్థానికంగా కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఇంటి యజమాని తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది రోహిణిలోని నాహర్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక బస్సు డ్రైవర్ ముందుగా తన భార్య, పిల్లలను హత్య చేశాడు. తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. గృహ కలహాల కారణంగానే ఈ ఘటన జరివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అలాగే తాగినమైకంలో ఆ డ్రైవర్ ఈ హత్యలకు పాల్పడివుండవచ్చని కూడా భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణి ప్రాంతానికి చెందిన డ్రైవర్ ధీరజ్(30) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :