సంబంధిత వార్తలు
- హైదరాబాద్ నడ్డి విరిచి ఎట్టకేలకు గెలిచిన సీఎస్కే: ఊపిరి పీల్చుకున్న ధోనీ
- చెన్నై ఖాతాలో మరో ఓటమి : జట్టును ఒంటి చేత్తో గెలిపించిన కోహ్లీ
- ఐపీఎల్ 2020- చెన్నై Vs ఆర్సీబీ.. క్రిస్ మోరిస్ ఎంట్రీ.. సీఎస్కేకి కష్టాలు తప్పవా?
- ఐపీఎల్ 2020 : లక్ష్య ఛేదనలో చతికిలపడిన చెన్నై ... నైట్ రైడర్స్ రైట్ రైట్
- హ్యాట్సాఫ్ టు ధోనీ ... ఇక చెన్నై సింహాలను నిలువరించడం కష్టమే : బ్రెట్ లీ
అది వైడ్ బాలా? కాదా? కోపంతో చూస్తూ గొణిగిన ధోనీ- వీడియో వైరల్ (video)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో భాగంగా చెన్నై-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాదుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు 20 పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా చెన్నై జట్టు ఆరో స్థానానికి ఐపీఎల్ పట్టికలో ఎగబాకింది. సన్‌రైజర్స్‌పై గెలవడం కోసం చెన్నై ఆటగాళ్లు పడిన కష్టాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ధోనీ వీడియో ఒక ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో చెన్నై కెప్టెన్ ధోనీ కోపంగా చూస్తున్నట్లుంది. ఆటకు 19వ ఓవర్ వద్ద సీఎస్‌కే ప్లేయర్ శార్దూల్ బంతిని విసిరాడు. ఆ ఓవర్ రెండో బంతిని రషీద్ ఖాన్ ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో బంతిని ఆఫ్ స్టంప్‌కు బయట విసిరాడు శార్దూల్ ఠాగూర్. ఆ బంతి వైడ్‌లా తెలిసింది. అంతకుముందు కూడా ఇదే తరహాలో బంతి వైడ్ అయ్యింది. దానికి అంపైర్ వైడ్ అని ప్రకటించాడు. ఈసారి కూడా వైడ్ అని ప్రకటించేందుకు అంపైర్ చేతినెత్తడంతో ధోనీ అంపైర్‌ను కోపంగా చూశాడు.
అంతటితో ఆగకుండా నోటితో ఏదో గొణికాడు. దీన్ని చూసిన హైదరాబాద్ టీమ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా కోపంతో చూశాడు. కారణం తద్వారా హైదరాబాదుకు ఒక పరుగు లభించకపోవడమే. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
