1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Chennai Super Kings, Royal Challengers Bangalore seek middle-order boost

ఐపీఎల్ 2020- చెన్నై Vs ఆర్సీబీ.. క్రిస్ మోరిస్ ఎంట్రీ.. సీఎస్కేకి కష్టాలు తప్పవా?

Chennai Super Kings
ఐపీఎల్ 2020 సీజన్లో మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అనేది ఆసక్తికరంగా మారింది. 
 
అయితే ఈ రెండు జట్లు ముఖాముఖి తలపడినప్పుడు గత రికార్డులను చూసుకుంటే చెన్నై జట్టు పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. ఈసారి చెన్నై జట్టు కూడా అంతగా బలంగా లేదన్న సంగతి తెలిసిందే.
 
ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి గాయం కారణంగా బెంగళూరు జట్టుకు దూరంగా ఉన్న సీనియర్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్లో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది బెంగళూరు జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
అంతేకాకుండా బెంగళూరు జట్టులో మరికొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి శనివారం సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో మళ్లీ చెన్నై జట్టు విజయం సాధిస్తుందా లేక ఆర్సీబీ సత్తా చాటుతుందా అనేది చూడాలి. 
 
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 6000 పరుగులు చేరుకోవడానికి విరాట్ కోహ్లీకి 31 పరుగులు అవసరం. ఈ రికార్డును ఈ మ్యాచ్‌లో కోహ్లీ రికార్డు సాధిస్తాడా లేదో చూడాలి. అలాగే ట్వంటీ-20ల్లో 300 సిక్సర్లు చేరేందుకు కెప్టెన్ ధోని ఒక్కసారి బౌండరీ క్లియర్ చేయాల్సి వుంది. 
తర్వాతి కథనం
డేవిడ్ వార్నర్ 50:50 : ఖాతాలో అరుదైన రికార్డు (Video)