బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (13:25 IST)

తగ్గిపోయిన ఐఫోన్ అమ్మకాలు.. సీఈవో కుక్ శాలరీలో కోత..

ప్రపంచంలోనే అత్యధిక వాటాను కలిగి వున్న యాపిల్ కంపెనీ.. నష్టాల్లో మునిగిపోయింది. తన టాప్ ఎగ్జిక్యూటివ్, సీఈవో టీమ్ కుక్‌కు యాపిల్ ఝలక్ ఇచ్చింది. రెవెన్యూ, లాభాలు, లక్ష్యాలను చేధించకపోవడంతో కుక్‌కు అంది

ప్రపంచంలోనే అత్యధిక వాటాను కలిగి వున్న యాపిల్ కంపెనీ.. నష్టాల్లో మునిగిపోయింది. తన టాప్ ఎగ్జిక్యూటివ్, సీఈవో టీమ్ కుక్‌కు యాపిల్ ఝలక్ ఇచ్చింది. రెవెన్యూ, లాభాలు, లక్ష్యాలను చేధించకపోవడంతో కుక్‌కు అందించే పరిహారాల్లో కోత పెట్టింది. గత ఏడాదితో పోలిస్తే.. సీఈవో ఆదాయం 1 మిలియన్ పెరిగినా... అతనికి అందే అలవెన్సులను మాత్రం తగ్గించినట్లు కంపెనీ పేర్కొంది. 
 
గత ఏడాది 8.75 మిలియన్ డాలర్లు అర్జించినట్లు సెక్యురిటీ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కు సమర్పించిన ప్రకటనలో తెలిపింది. 2015 ఏడాదిలో కుక్ 10.28 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందినట్లు వివరించింది. కంపెనీ వార్షిక విక్రయాలు 4 శాతం తగ్గినట్లు తెలిపింది. మొత్తం 223.6 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. నిర్వహణ ఆదాయం 0.5 శాతం పడిపోయిందని, ఇది ఎగ్జిక్యూటివ్ పరిహారంపై పడిందని, దీంతో అతని పరిహారాలను తగ్గించాల్సి వచ్చిందన్నారు. గత 15 ఏళ్లలో తొలిసారి తమ రెవెన్యూలను కోల్పోవలసి వచ్చిందని యాపిల్ సంస్ధ ప్రకటన విడుదల చేసింది. తద్వారా సీఈవో వేతనంలో కోత విధించక తప్పలేదు. 
 
ప్రస్తుతం సెప్టెంబర్‌ 24తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గానూ టిమ్ కుక్‌కు రూ.59.3 కోట్లు (8.7మిలియన్‌ డాలర్లు) చెల్లించినట్లు రెగ్యులేటరీకి ఆ సంస్థ తెలిపింది. అంతకు ముందు సంవత్సరం యాపిల్ సీఈవోకు సుమారు రూ.70 కోట్లు (10.3మిలియన్‌ డాలర్లు) చెల్లించారు. కానీ ప్రస్తుతం ఆయన వేతనంతో పాటు ఇతర టాప్ ఎగ్జిక్యూటీవ్‌ల వేతనాల్లోనూ కోత విధించినట్లు తెలుస్తోంది. ఇంకా యాపిల్ సంస్థ రాబడులు గతంలో కంటే 8శాతం పడిపోయి రూ.14,70,204 కోట్లకు చేరగా, నిర్వహణ లాభం 16 శాతం పడిపోయి 4,08,390 కోట్లకు చేరుకుంది.