సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 5 జూన్ 2016 (14:21 IST)

ఫేస్ బుక్‌లో ఇక మెసెంజర్ ఉండదా? మొబైల్ వెబ్ అప్లికేషన్ డిసేబుల్ కానుందా?

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్ బుక్.. తన మొబైల్ సైట్‌లో చాటింగ్ సౌకర్యాన్ని తొలగించనుందని తెలిసింది. దీంతో ఫేస్ బుక్ మొబైల్ సైట్ ద్వారా చాటింగ్ చేసే వారంతా ఆందోళన చెందుతున్నారు.

మెసెంజర్‌ యాప్‌కి నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య జనవరి నాటికి 900 మిలియన్లుగా ఉంది. ఇక మొబైల్‌ వెబ్‌ చాటింగ్‌ని తీసేస్తే.. మెసెంజర్‌కి డౌన్‌లోడ్‌లు మరింత పెరుగుతాయని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం.
 
ఇప్పటికే మెసేజింగ్‌ యాప్‌.. ‘మెసెంజర్‌’‌కు బిలియన్‌కు పైగా వినియోగదారుల్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో.. ఇకపై మొబైల్ సైట్‌లో చాటింగ్ బాక్సుకి చెక్ పెట్టి అందరికీ మెసెంజర్ నుంచి చాటింగ్ సౌలభ్యాన్ని కల్పించే దిశగా ఫేస్ బుక్ చర్యలు చేపట్టనుంది. 
 
ఇప్పటికే ఈ విషయాన్ని సంస్థ కొంత మంది కస్టమర్లకు మెసేజ్ రూపంలో ధ్రువీకరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు మొబైళ్లలో మెసెంజర్ లేకపోయినా నేరుగా ఫేస్ బుక్ నుంచి చాటింగ్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇకపై ఆ మెసేజ్‌ మీ ఫోన్‌కీ వస్తే.. చాటింగ్‌ సౌకర్యం ఇక కనుమరుగు కావచ్చునని తెలుస్తోంది.