శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (06:23 IST)

నెట్ కనెక్షన్ లేదా.. డోంట్‌వర్రీ.. సాఫీగా గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి.. ఎలా?

ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమకు అవసరమైన సమాచారం కోసం ప్రతి ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి తీరాలి. అయితే, ఈ సరికొత్

ఇంటర్నెట్ సెర్చ్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. తమకు అవసరమైన సమాచారం కోసం ప్రతి ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఇందుకోసం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి తీరాలి. అయితే, ఈ సరికొత్త ఫీచర్ ద్వారా నెట్ కనెక్షన్ లేకపోయినా సాఫీగా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నెట్ స్పీడ్ తక్కువగా వస్తున్నా, అసలు ఇంటర్నెట్‌ కనెక్షన్ లేకున్నా యూజర్లు వెబ్‌లో సమాచారాన్ని వెదకవచ్చు. అదెలాగంటే... 
 
యూజర్లు సెర్చ్ చేసిన పదాలను గూగుల్ స్టోర్ చేసి పెట్టుకుని అనంతరం నెట్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చినప్పుడు ఆ పదాలకు అనుగుణంగా వెబ్ ఫలితాలను యూజర్‌కు చేరవేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ సెర్చ్ యాప్‌ను వాడుతున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అన్ని ప్లాట్‌ఫాంలపై ఈ సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ యత్నిస్తోంది.