Lava Virat V1 5G: లావా విరాట్ వీ1 5జీని విడుదల.. ఫీచర్స్ ఇవే
Lava Virat V1 5G
ఈ రెండు ఫోన్లు దాదాపు ఒకే రకమైన ప్రీమియం ఫ్లాట్ ప్యానెల్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. లావా విరాట్ వీ1 4 జీలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన చదరపు ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను అందించారు.
అలాగే లావా విరాట్ వీ1 5జీ ఈ హై-ఎండ్ వేరియంట్‌లో మరింత ఆకర్షణీయమైన డ్యూయల్ కెమెరా సెటప్‌ను చేర్చారు. దీని బ్యాక్ ప్యానెల్‌పై ప్రత్యేకమైన డిజైన్ ప్యాట్రన్ హైలైట్‌గా నిలుస్తోంది. ఫోన్ కింది భాగంలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, స్పీకర్ గ్రిల్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్: వినియోగదారుల కోసం ఈ ఫోన్లు బ్లూ, గోల్డ్ రంగులలో అందుబాటులోకి రానున్నాయి.
లావా విరాట్ వీ1 5జీ మోడల్ ధర సుమారు రూ. 15,000 నుంచి రూ. 20,000 మధ్య ఉండే అవకాశం ఉంది.
