ట్రెండ్ అవుతున్న హారతి ప్రాంక్ వీడియోలు.. కాలిపోతున్న చేతులు
prank video
హారతి తీసుకునే ముందు చేతులు కడుక్కోమని వారి చేతులపై ఓ లిక్విడ్ పోస్తున్నారు. వాళ్లు ఆ లిక్విడ్‌తో చేతులు కడుక్కుని హారతి తీసుకోగానే.. భగ్గున చేతులకు మంటలు అంటుకుంటున్నాయి.
అది కూడా చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రాంక్ కారణంగా చాలా మంది చేతులు కాలిపోయాయి. ఈ వీడియో చూసిన వారంతా మండిపడుతున్నారు. హారతి ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
