బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (22:47 IST)

జియో అదుర్స్.. నాలుగో త్రైమాసిక ఫలితాలు.. 13.17 శాతం పెంపు

reliance jio
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో అంబానీ టెలికాం వెంచర్ నికర లాభం రూ.5,337 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.4,716 కోట్ల కంటే 13.17 శాతం అధికమని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.25,959 కోట్లుగా నిలిచింది. ఇదే సమయంలో కంపెనీ ఖర్చులు 10.2 శాతం వృద్ధి చెందాయి. రిలయన్స్ జియో టెలికాం రంగంలో స్థిరంగా సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది. 
 
తాజాగా దేశంలోని వివిధ నగరాలు, పట్టణాలకు తన 5జీ సేవలను వేగంగా రోలౌట్ చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఇదే క్రమంలో వైర్‌లెస్, వైర్‌లైన్ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం చర్యలు తీసుకుంటోంది.