ట్రంప్ దెబ్బ... ఐటీ ఉద్యోగులకు నో అప్రైజల్... టెక్ మహీంద్ర మొదలెట్టింది...

అమెరికా నూతన అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కారణంగా భారతదేశ ఐటీ ఉద్యోగులపై అది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రతి ఏడాది ఉద్యోగులకు కాస్తోకూస్తో జీతాన్ని పెంచే కార్యక్రమాన్ని పలు కంపెనీలు నిలుపుదల చేస్తున్నాయి. టెక్ మహీంద్ర తమ క

ivr| Last Modified సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (17:44 IST)
అమెరికా నూతన అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కారణంగా భారతదేశ ఐటీ ఉద్యోగులపై అది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ప్రతి ఏడాది ఉద్యోగులకు కాస్తోకూస్తో జీతాన్ని పెంచే కార్యక్రమాన్ని పలు కంపెనీలు నిలుపుదల చేస్తున్నాయి. టెక్ మహీంద్ర తమ కంపెనీలో ఆరేళ్లకు పైబడి అనుభవం వున్న ఉద్యోగులకు ఈ ఏడాది అప్రైజల్... జీతం పెంచే అవకాశం లేదని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో చోటుచేసుకున్న పరిస్థితులే దీనికి కారణమని తెలిపింది. దిగువశ్రేణి ఉద్యోగులకు కూడా అప్రైజల్ నిర్వహించినప్పటికీ జూలై నుంచి అది ఆచరణలోకి వస్తుందని టెక్ మహీంద్ర తెలిపింది. మరోవైపు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు కూడా అప్రైజల్ గురించి ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ట్రంప్ అమెరికన్ల గుండెల్లోనే కాదు ఇండియన్ ఐటీ ఉద్యోగులకు చేదు గుళికలు మింగిస్తున్నాడు.దీనిపై మరింత చదవండి :